Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొరుగురాష్ట్రాల్లో పర్యటించిన అధికారుల బృందం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సంస్థ స్వయం సమద్ధి, ప్రయాణీకులకు సంతప్తికరమైన సేవలు, సిబ్బంది, ఉద్యోగుల సంక్షేమ ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక కార్యప్రణాళికతో ముందుకు వెళ్ళాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు బస్‌భవన్ లోని కొందరు ఉన్నతాధికారులు పొరుగు రాష్ట్రాల ఆర్టీసీల పనితీరును పరిశీలించి వచ్చారు. ఇప్పటి వరకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయనీ, వాటిని మరింత మెరుగు పరుచుకొనేందుకు అధికారుల పర్యటనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, సంస్థ కార్యదర్శి పీవీ మునిశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సీ వినోద్, వెంకటేశ్వర్లు, ఇ.యాదగిరి నేతత్వంలో ఐదు బృందాలు వేర్వేరుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో పర్యటించి వచ్చారు. అక్కడి రవాణా సంస్థల పనితీరును పరిశీలించి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి శుక్రవారం దానిని సంస్థ ఎమ్డీ వీసీ సజ్జనార్‌కు సమర్పించారు. ఆయా ఆర్టీసీల ఆర్థిక స్థితి, రవాణా సామర్థ్యం, బస్సుల కొనుగోలు, బస్ స్టేషన్ల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రయాణీకులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పన, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రాయితీలు, మార్కె టింగ్ స్కీమ్స్, ఖర్చుల నియంత్రణ, టిక్కెటేతర ఆదాయ మార్గాలు, అద్దె బస్సుల నిర్వహణ వంటి వివిధ అంశాలపై అధికారులు అధ్యయ నం చేశారు. ఈ మేరకు శుక్రవారం బస్‌భవన్‌లో సంస్థ చైర్మెన్, ఎమ్డీ తో సమావేశమై తమ నివేదికలపై చర్చించారు. ఇప్పుడున్న విధానాల్లో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్డీ, చైర్మెన్ అభి ప్రాయపడినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మరో విశ్లేషణా త్మక నివేదిక ఇవ్వాలని వారు అధికారులను ఆదేశించారు.