Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
- అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం
- కీసరలో 10.18 సెంటీమీటర్ల వాన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి నెలకొని ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అయితే, అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 352 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని బండ్లగూడలో అత్యధికంగా 10.18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది.