Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వాతంత్య్ర వజ్రోత్సవ కమిటీ సమావేశంలో నిర్ణయం
- జీఏడీ ప్రాతిపాదనలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల కమిటీ చైర్మెన్, ఎంపీ డాక్టర్ కె.కేశవరావు అధ్యక్షతన ఆ కమిటీ శుక్రవారం హైదరాబాద్లో సమావేశ మంది. ఆ సమావేశంలో సాధారణ పరిపాలనా విభాగం చేసిన ప్రతి పాదనలపై చర్చించి పలు నిర్ణయా లు తీసుకున్నారు. కమిటీ సభ్యులు ప్రభుత్వ సాంస్కతిక సలహాదారు డా.కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సిఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురేయాలనీ, హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాల వద్ద విద్యుత్ దీపాలంకరణ, ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలు, స్వాతంత్య్ర పోరాటం, స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల చిత్రాలతో హౌర్డింగ్లను ప్రదర్శిం చాలని నిర్ణయించారు. ఫిల్మ్ ఫెస్టి వల్ నిర్వహించాలనీ, సినిమా హాళ్ల లో, పాఠశాలలు, కళాశా లల్లో దేశభక్తి చిత్రాలను ప్రదర్శించాలనీ, జానపద పాటలు, నృత్యాలు, నిర్వహణ, పాఠ శాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వం, పాటలు, నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ల పోటీలు, ఫ్యాన్సీ డ్రస్ పెరేడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవీంద్రభారతిలో 15 రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా బృందాలతో రంగోళీ కార్యక్రమాలు, ముగింపు కార్యక్రమంలో ప్రతి జిల్లా నుంచి వెయ్యి నుంచి రెండు వేల మందిని ర్యాలీగా హైదరాబాద్ రప్పించాలనే నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కె.టి. రామారావు, టి.శ్రీనివాస్ యాదవ్, పి. సబితా ఇంద్రా రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత తదుపరి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది.