Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు చేసుకున్న ప్రతీ విద్యార్థికి సీటివ్వాలి: టీజీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు సరిపడా సీట్లు పెంచాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకనుగుణంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు ఇవ్వాలని, పాఠశాలలు, కాలేజీల సంఖ్యను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. గురుకులాల్లో సీట్లకోసం కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరుగుతున్నారని పేర్కొన్నారు. సీట్లు రాక చదువు మధ్యలోనే ఆగిపోతుందంటూ వారు ఆందోళనకు గురవుతున్నారని తెలి పారు. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తెలంగాణ గిరిజన గురుకులం కార్యదర్శి వాటిని పట్టించుకోవటంలేదని ఆరోపించారు.