Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో అవినీతి పాలన
- కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో పార్టీ విస్తరణ, బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. అవినీతే జరగనప్పుడు విచారణలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతున్నదని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఆధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సింథియా ఖండించారు. ఆయన ముర్మునేకాదు.. ఆదివాసీగిరిజనులను, మహిళలను అవమానించారని విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో పార్టీ బలోపేతానికి ఒక నిబద్ధత కార్యకర్తగా తన వంతు కృషి చేస్తానన్నారు. కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, నేతలు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్, పాండుయాదవ్, సురేందర్‌రెడ్డి, సుభాష్‌చందర్, తదితరులు పాల్గొన్నారు.