Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెత్తందారుల దాడుల నుంచి వారికి రక్షణ కలిపించాలి
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ , మానవ హక్కుల కమిషన్ చైర్మెన్‌కు వ్యకాస పిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితుల సాగు భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల చైర్మెన్లకు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, బొప్పని పద్మ, హన్మకొండ జిల్లా కార్యదర్శి రాములు, రాష్ట్ర నాయకులు ఆర్ ఆంజనేయులు, వేర్పుల రవి పిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామ పంచాయితీ శివారు గ్రామమైన ఇచ్చుల్లపల్లి గ్రామంలో దళితుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి గ్రామ పెత్తందారులు చేసుకున్న పట్టాలు రద్దు చేయాలని కోరారు. ఆ భూముల్లో సాగుదార్లకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెత్తందారుల భౌతిక దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు కలెక్టర్ కు అదేశాలివ్వాలని కోరారు. వెంటనే జోక్యం చేసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తామని ఈ సందర్భ ంగా అధికారులు వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చుల్లపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్లు 69,70, 71 ,72, 73 , 74/1, 74/ 2, 75 నుంచి 81 వరకు గల ప్రభుత్వ భూమిలో 69కుటుంబాలుపైగా తర తరాలుగా వర్షాభావ పంటలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. 23.09.2010 న అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఈ భూములు పై ఆధార పడి బతుకుతున్న దళితులను పరిశీలించి పట్టా ఇవ్వాలంటూ నెం : ఇ3 3593 / 2010 సర్క్యులర్‌ను భీమదేవరపల్లి తహశీల్దార్‌కు పంపారని గుర్తుచేశారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.