Authorization
Fri May 16, 2025 08:30:24 pm
- సీఎంకు రేవంత్‌రెడ్డి ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు కష్టం వరద పాలైందనీ, పంటనష్టం అంచనా వేయాలన్న సోయి సర్కారుకు లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.జనాలు వరదల్లోబాధపడుతుంటే, సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏ చీకటి రాచకార్యాలు వెలగబెడుతున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. పంట నష్టం అంచనాకు తక్షణమే క్షేత్రానికి బృందాలను పంపాలనీ, ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.