Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి స్కూల్‌కు హెచ్ఎంను నియమించాలి :ఎస్జీటీయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బంగారు తెలంగాణలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీ యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆంగ్ల మాధ్యమం ప్రారంభించినా ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయని తెలిపింది. ఈ మేరకు ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానోపాధ్యాయుల్లేక, పారిశుధ్య కార్మి కుల్లేక ప్రాథమిక పాఠశాలలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నా రు. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకు సర్దుబా టు పేరుతో పంపించడం వల్ల మరింత నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఒకరు లేదా ఇద్దరు ఉపా ధ్యాయులే కార్యాలయ పనులతోపాటు ఆన్లైన్ మెసేజ్‌లు, 18 సబ్జెక్టుల బోధన, పారిశుధ్య నిర్వహణ, శిక్షణ, సమావేశాలు, అత్యవసర నివేదికలు పంపించడం వంటిపనులతో సతమతమవుతున్నారని తెలిపారు. దీంతో సర్కారు బడుల్లో చదివేబడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు నాణ్య మైన విద్య అందడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని సర్దుబాటు ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేశారు.