Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సై అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ విజ్ఞప్తి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఎస్సై, తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను నేటి నుంచి (ఈనెల 30, శనివారం) డౌన్లోడ్ చేసుకోవాలని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మెన్ వి.వి శ్రీనివాస్ రావు తెలిపారు. ఆగస్టు 7న ఎస్సై, తత్సమాన పోస్టులకు బోర్డు ప్రిలిమినరీ రాత పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ హాల్ టికెట్లను 30 తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. తమ అధికారిక వెబ్సైట్ www.tslprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ ఎస్సై పోస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు రాతపరీక్ష రాయడానికి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా 502 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్టికెట్లు డౌన్లోడ్ కాని అభ్యర్థులు తమ అధికారులను సంప్రదించాలని ఆయన చెప్పారు.