Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటి శాఖ ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 2020 అక్టోబరు నుంచి సేకరించిన భూముల వివరాలను మొత్తం రెవెన్యూ రికార్డుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (పరిపాలన)బి.అనిల్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు శుక్రవారం ప్రత్యేకంగా సర్క్యులర్ ఇచ్చారు. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి, ఆయా ప్రాజెక్టుల కోసం భూములను సేకరించి పరిహారం చెల్లించినా రెవెన్యూ రికార్డుల్లో పాత యాజమానుల పేర్లే ఉండటం మూలంగా ప్రభుత్వం ఆర్థిక భారం మోయాల్సి వస్తున్నదని చెప్పారు. భూసేకరణ చేసిన తర్వాత కూడా రైతుబంధు, రైతు బీమా వంటి సదుపాయాలు పొందుతున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ఎస్ఈలు ఈమేరకు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పా రు. వచ్చే ఆగస్టు రెండో తేదీల్లో రికార్డుల్లో చేర్చే ప్రక్రియను పూర్తి చే యాలని ఆదేశించారు. భూసేకరణ వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించి రెవెన్యూ శాఖ రికార్డుల్లో సాగునీటి శాఖ పేరును చేర్చాలని సూచించారు. ఇక ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల భూముల వివరాలు కూడా ఆగస్టు రెండులోగానే ప్రభుత్వ రికార్డుల్లో నమోదయ్యేలా చొరవచూపాలని కోరారు. మిషన్ కాకతీయ కింద మిగిలిన 2200 చెరువుల జియో ట్యాగింగ్ పనులు కూడా నిర్దేశించిన గడువులోగా చేపట్టాలని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించి న మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించా రు. ఇంజినీర్లం దరూ ఆగస్టు 16 తేదీలోగా 'ఇంజినీర్స్ సెక్యూరిటీ స్కీమ్(ఈఎస్ఎస్)లో చేరాలనీ, ఆ మేరకు శాఖపరిధిలోని ఆర్థిక వ్యవహా రా లు చూసే అధికారులు బాధ్యత వహించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.