Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులు తీర్చే మార్గంలేక..
- ఉరేసుకొని రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-తాడ్వాయి
ఇప్పటికే సాగుకు చేసిన అప్పులు తీర్చలేకపోతుండగా.. ఇటీవల కురిసిన వర్షాలతో పంట మొత్తం నీటమునగడంతో అప్పులు తీర్చే మార్గం లేదని తీవ్ర మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది. ఎస్ఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఆకిటి కృష్ణకుమార్ (36) తనకున్న భూమిలో ఆరుతడి సాగు కింద మొక్కజొన్న పంట సాగు చేశారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలతో మక్కపంట జలమయమై తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే అప్పులుండగా.. పంటకు నష్టం వాటిల్లడంతో అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుమారుడు కుటుంబీకులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. భార్య అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వివరించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.