Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి : జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ (హన్మకొండ)
గొర్రెల కాపర్ల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాడాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్ పిలుపునిచ్చారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ మాట్లాడారు. గొర్రెల, మేకల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార దిశగా కార్యాచరణ రూపొందించాలని కార్యకర్తలకు సూచించారు. రెండో విడత గొర్ల పంపిణీలో నగదు బదిలీ చేయకుంటే దళారులు, అధికారులు మాత్రమే లాభపడతారని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రవేశపెట్టిన 10 తీర్మానాలను కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసాని ఐలయ్య, ఉపాధ్యక్షుడు అవిశెట్టి శంకరయ్య, జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య, నాయకులు సాదం రమేష్ తూషాకుల లింగయ్య, ఆలేటి యాదగిరి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అమీర్పేట్ మల్లేశం, బొల్లం అశోక్, కాల్వ సురేష్, పరికి మధుకర్, జిల్లా అధ్యక్షుడు శాతబోయిన రమేష్, గంటి సమ్మయ్య, వేల్పుల రమేష్, బండి పర్వతాలు, రాజు, జంపాల రమేష్, కె.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.