Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వం జాతీయ జెండాలను కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నదనీ, ప్రధాని మోడీ చెప్తున్న మేకిన్ ఇండియా ఇదేనా అని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి చెప్పిన మాటల్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం పేరుకే మేకిన్ ఇండియా అంటున్నదనీ, కనీసం జాతీయ జెండాలను కూడా దేశంలో తయారు చేసే పరిస్థితులను సష్టించలేదని విమర్శించారు. విశ్వగురువుగా డాంబికాలు ప్రదర్శించే కేంద్రం 75వ భారత దేశ స్వాతంత్య్ర సంబరాలు చేస్తామని ముందే తెలిసినా, కనీస ప్రణాళిక, ఏర్పాట్లు చేసుకోలేదనీ, ఆత్మ నిర్భర భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.