Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఆటోలపై భారాన్ని తగ్గించిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్ అని కేసీఆర్ సేవాదళం గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎంఏ.సలీం అన్నారు. 'దిల్ వాలా సీఎం', 'భారత శాంతి రత్న' అనే బిరుదులతో తాము కేసీఆర్‌ను సత్కరిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలీం మాట్లాడుతూ ఇటీవల రూ.50 లేట్ ఫిట్నెస్ను రద్దు చేసి ఆటో డ్రైవర్లపై భారాన్ని తొలగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అదే విధంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల నుంచి 75 శాతం వరకు పెనాల్టీని తగ్గించారని గుర్తుచేశారు. ఆటోలపై ఎంవీ ట్యాక్స్ మినహాయింపు, ఆటో లైసెన్స్ 8వ తరగతి నిబంధనను ఎత్తివేయడమే కాకుండా ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందదాయకమన్నారు. 1,783 మంది మైనారిటీ డ్రైవర్లకు 50 శాతం సబ్సిడీతో బ్యాంక్ రుణాల ద్వారా ఆటోలను ఇప్పించారని చెప్పారు. ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మొహమ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సందర్భంలో 2014 ఎన్నికల సమయంలో 'తెలంగాణ పోరాట రత్న' అనే బిరుదును కేసీఆర్‌కు ప్రదానం చేసినట్లు చెప్పారు.