Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వైద్య పరిశోధనా కేంద్రంగా హైదరాబాద్ రూపుదిద్దుకున్నదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. వైద్య సంబంధిత అంశాలు వివిధ వ్యాక్సిన్లు, ఔషధాలకు సంబంధించి భారతదేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధలను పరీక్షించే కేంద్రంగా హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ కేంద్రం (ఎన్ఏఆర్ఎఫ్బీఆర్) ప్రత్యేకతను సంతరించుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జినోమ్ వ్యాలీలోని ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ను ఆయన సందర్శి ంచారు. శాస్త్రవేత్తలు, అధికారులతో ముచ్చటించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో, పరిశోధన, తదితర అవసరాలకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు పూర్త వుతున్నాయనీ, దాదాపుగా 60 శాతం పరికరాలు, మిషనరీ వచ్చేశా యని వెల్లడించారు. ఎలుకల నుంచి గుర్రాల వరకు వివిధ జంతువుల పై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయన్నారు. భారత్ తోపాటు ప్రపంచ అవసరాలు తీర్చేలా ఈ ఇనిస్టిట్యూట్ ను రూపొందిస్తున్నట్టు తెలిపారు.