Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి: అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న చేపట్టనున్న ప్రత్యేక హరిత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో మొక్కలు నాటేందుకుగానూ తగిన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్లు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం గతం కంటే 7.7 శాతం పెరిందని చెప్పారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండాల్సి ఉండగా..ప్రస్తుతం అది 31.6 శాతానికి చేరిందని తెలిపారు. ఎనిమిదో విడతలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. పచ్చదనం పెంపు విషయంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం ఎరిగి పర్యావరణ సమతుల్యం కావడానికి ఈ హరితహారం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సమాచార పౌరసంబంధాల శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.