Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేల ఫిర్యాదు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని అయా జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, కె. లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య వినతిపత్రం అందజేశారు. చట్టసభల ప్రతినిధులను గౌరవించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం చేశార. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార విమర్శలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. షర్మిలపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు స్పందించిన స్పీకర్ షర్మిల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని చెప్పారు. ఈనేఏపథ్యంలో సభాహక్కుల ఉల్లంఘన కమిటీ సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.