Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మూడు రోజులు జరిగిన రాష్ట్ర శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 బిల్లులకు ఆమోదం లభించింది. ఈనెల 6వ తేదీ ప్రారంభమైన శాసనమండలి సమావేశాలు వరుస సెలవుల తర్వాత తిరిగి ఈనెల 12, 13 తేదీల్లో జరిగాయి. మొత్తం 11 గంటల 42 నిముషాల పాటు శాసనమండలి పనిచేసిందని చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. 4 స్వల్పకాల ప్రశ్నలు, 2 దీర్ఘకాల ప్రశ్నలపై చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు మాట్లాడారు.