Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై చర్చించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు శాసనమండలిలో ఆయన మంగళవారం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఉపాధ్యాయుల కొరత, పదోన్నతుల సమస్యలపైన చర్చించాలని పేర్కొన్నారు.
ఈ తీర్మానాన్ని చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిరస్కరించారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలపై చర్చించాలంటూ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరించారు.