Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలిలో ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం మండలిలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంఘసంస్కర్త, సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు, మేధావి అంబేడ్కర్ అని ఆమె కొనియాడారు. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
ప్రజల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైన విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరిం చుకోవాలని కేంద్రాన్ని కోరుతూ శాసనమండలి తీర్మానించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేదిగా, ప్రయివేటు కంపెనీల ఆధిపత్యానికిి దారి తీసేదిగా ఈ బిల్లు ఉందని ఆయన విమర్శించారు. ఈ తీర్మానాన్ని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.