Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ఈ నెల 17 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో 16న రాష్ట్రంలోని అన్ని తండాలు, గూడేల్లో అమరు లను స్మరిస్తూ సభలు నిర్వహించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్, ఆర్ .శ్రీరామ్ నాయక్ మంగళ వారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా జరిగిన సాయుధ పోరాటంలో గిరిజనులు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఆ పోరాటం ద్వారా లక్షలాది ఎకరాల భూములపై పేదలు హక్కులు పొందారని పేర్కొన్నారు. ఆ పోరాటంలో జాటోత్ ఠానూ నాయక్ ఆరుగురు అన్నదమ్ములతో పాటు వాచ్యా, భీమ్లా ,సోయం గంగులు ,చెంచురామయ్య, కోయ వెంకటమ్మ ,లంబాడి భాషు, భూక్య బాల్యా వంటి ఎందరో గిరిజన వీరులు అమరులయ్యారని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తిని గిరిజన యువతకు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు విరివిగా జరపాలని పిలుపునిచ్చారు.