Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- తీరు మార్చుకోవాలి : మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అప్పులు తెచ్చి తెచ్చి అభివృద్ధి చేస్తామనడం మంచిపద్ధతి కాదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలిలో 'ఎఫ్ఆర్బీఏం చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి-రాష్ట్ర ప్రగతిపై ప్రభావం'అనే అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలను అమలు చేయకుంటే ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం తగ్గించడాన్ని ఖండించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అదనంగా నిధులివ్వాల్సింది పోయి సహకరించకపోవడం సరైంది కాదన్నారు. 2014లో రాష్ట్ర అప్పు రూ.60 వేల కోట్లుంటే, నేడు రూ.ఐదు లక్షల కోట్ల చేరిందని వివరించారు. అదే సమయంలో కేంద్రం అప్పు రూ.60 లక్షల కోట్ల నుంచి రూ.130 లక్షల కోట్లకు చేరిందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాలు అప్పుల ఊబిలోకి తీసుకుపోయాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి మోడీ ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపుతున్నదని చెప్పారు. ఇంకోవైపు గ్యాస్ సబ్సిడీని తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పాలపొడి, ఆహార పదార్థాలపై జీఎస్టీ విధిస్తున్నారని విమర్శించారు. మద్యం అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉన్న మద్యం విధానాన్నే టీఆర్ఎస్ ప్రభుత్వం అమ లు చేస్తున్నది తప్ప వేరేది లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. తన అనుమతి లేకుండా మధ్యలో మాట్లాడొద్దంటూ పల్లా తీరుపై చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.