Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉచితంగా గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయుల ఫిజికల్ కోచింగ్కు శిక్షణ ఇస్తున్నట్టు ఆ సంస్థ అడ్మినిస్ట్రేటర్ యు రఘురాంశర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనికోసం అర్హులైన బ్రాహ్మణ అభ్యర్థులు ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని 50 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. గ్రూప్-3, గ్రూప్-4 కోచింగ్ కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకులం ఉపాధ్యాయుల కోచింగ్ ప్రోగ్రాం కోసం పై అర్హతతో పాటు బీఈడీలోనూ 60 శాతం మార్కులు సాధించి ఉండాలని చెప్పారు. ఇతర వివరాలకు brahminparishad.telangana.gov.in వెబ్సైట్లో, లేదా 040-24754811 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.