Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ ఏడాది ఐఐటీ, నీట్, జేఈఈ పరీక్షల్లో గురుకులాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు పొందారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద ్లో ఐఐటీ జేఇఇ, నీట్ 2022 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 400 మంది కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశం పొందారని తెలిపారు. విద్యార్థులను, ప్రోత్సహించిన సిబ్బందిని, తల్లిదండ్రులను మంత్రి అభినందించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 42 ర్యాంకులు వస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 1,312కు పెరిగిందని చెప్పారు. 561 మంది ఐఐటీ, 750 మంది ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం పొందారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వలేదని విమర్శించారు. గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నామని తెలిపారు.