Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో రూ.24 కోట్ల 68 లక్షలతో నిర్మించిన కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్, రూ.24 కోట్ల 43 లక్షలతో నిర్మించిన సేవాలాల్ బంజారా భవనాలను ఈ నెల 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.75 కోట్ల 86 లక్షలతో 32 ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించింది. ఆదివాసీ గిరిజన జాతరల నిర్వహణ, వసతుల కల్పనకు రాష్ట్ర ఏర్పాటు నుంచి గత రూ.354 కోట్లను ఖర్చుచేసింది. .మ్యూజియంల ఏర్పాటుకు రూ.22 కోట్ల 53 లక్షలను వెచ్చించింది.