Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల, మతాలతో ఓట్లు అడుగుతున్నారు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ పలు ఊళ్లలో కరెంట్, నీరు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము వచ్చాక వాళ్ల ఊరుకు కరెంటు వచ్చిందని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లో క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఫర్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న 36వ చాప్టర్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. 2022 వరకు కూడా కరెంట్, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండడం మన దురదష్టమన్నారు. నాణ్యత అనగానే విదేశాలు గుర్తుకు వస్తాయని కేటీఆర్ అన్నారు. 1986లో చైనా, భారత్ రెండు దేశాల జీడీపీ ఒకేరంగా ఉండేదన్నారు. కాగా.. ఇప్పుడు చైనా అన్ని రంగాల్లో భారీ వృద్థిని సాధించిందన్నారు. చైనా వద్ధి రేటు అంత పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని తెలిపారు. సింగిల్ మైండ్ ఫోకస్ థింగ్స్, ప్రపంచ అతిపెద్ద ఫార్మా క్లస్టర్లతో ముందుకెళ్తోందన్నారు. కానీ.. భారత్‌లో కుల, మతాలు చూస్తూ వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే మాటలతో నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ లేక పవర్ హాలీడేలు ఉండే వన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతర విద్యుత్‌ను అందుతుందన్నారు.