Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ బొమ్మను ముద్రించాలంటారేమో...? : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అహ్మదాబాద్ ఎల్జీ మెడికల్ కళాశాల పేరును 'నరేంద్ర మోడీ కాలేజీగా...' మార్చటాన్ని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియానికి ప్రధాని పేరు పెట్టారని.. ఇప్పుడు అహ్మదాబాద్ ఎల్జీ మెడికల్ కళాశాలకూ ఆయన పేరే పెట్టారని గుర్తు చేశారు. త్వరలో ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మ బదులు నరేంద్రమోదీ బొమ్మ వేస్తారేమో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.