Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు హీమోఫిలియా హైదరాబాద్ చాప్టర్ కృతజ్ఞతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రక్త సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం వికలాంగులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలివ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హీమోఫిలియా హైదరాబాదు చాప్టర్ కతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ధన్యావాదాలు తెలిపింది. ఈమేరకు శుక్రవారం చాప్టర్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, సుబాష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంతో తాము విద్యా, ఉద్యోగ, ఇతర సంక్షేమ పథకాల్లో లబ్ది పొందుతామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాదు హీమోఫిలియా చాప్టర్ వార్షికోత్సవం సందర్భంగా మంత్రికి ఈ విషయాన్ని విన్నవించామని వారు పేర్కొన్నారు.