Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ
- హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలకు రావాలని ముగ్గురు సీఎంలకు లేఖ రాశా : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూడు రాష్ట్రాల్లో నేటి నుంచి ఏడాదిపాటు హైదరాబాద్ విమోచన దిన వేడుకలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలకు రావాలని తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సీఎంలకు, తెలంగాణ మంత్రులు, సీఎస్‌కు ప్రత్యేకంగా లేఖలు రాశామని తెలిపారు. ఈ వేడుకలకు ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలను ఆహ్మానించామన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా జరపాలని రాష్ట్రంలోని సర్పంచులందరికీ లేఖలు రాశానని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారన్నారు. పారా మిలటరీ బలగాల కవాతు తర్వాత సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. మోడీ జన్మదినం సందర్భంగా శనివారం నాడు దివ్యంగులకు ట్రై సైకిల్స్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, వీల్ ఛైర్స్, ఆర్టిఫిషియల్ పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక పేరుతో కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర ప్రజల విజయమన్నారు.