Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సౌధలో ఘనంగా సమైక్యతా ఉత్సవాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సౌధలో తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రజల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌రంగం సాధించిన విజయాలను వెల్లడించారు. కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు జీ నర్సింగరావు, టీ జగత్‌రెడ్డి, జే సూర్యప్రకాష్, బీ నర్సింగరావు, ఎమ్ సచ్చిదానందం, ఎస్ అశోక్‌కుమార్, సీహెచ్ వెంకటరాజం, బీ లక్ష్మయ్య, ఏ అజయ్, డాక్టర్ టీఆర్కే రావు తదితరులు పాల్గొన్నారు.