Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని 84 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గండికోట శ్రీదేవి, జస్టిస్ ప్రియదర్శినిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమి బూర్గుల రామకష్ణ, లింగమయ్యలకు చెందినదని హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని ప్రభుత్వం రీకాల్ పిటీషన్ వేసింది. ప్రయివేటు వ్యక్తులు వేసిన రిట్కు విచారణా అర్హత గురించి తేల్చుతామని చెప్పిన హైకోర్టు, ఆ భూములు వారికి చెందుతాయని తీర్పు ఇచ్చిందనీ, దాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైధ్యనాథన్ వాదించారు. తమకు నోటీసు ఇవ్వలేదని ప్రభుత్వం చేసిన వాదనను ప్రయివేటు వ్యక్తుల తరఫు న్యాయవాదులు ఆదినారాయణరావు, అశోక్ ఆనంద్ వ్యతిరేకించారు. వాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.