Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రక్తహీనత సమస్యను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)ను సందర్శించిన ఆమె ఆహార శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. పాఠశాల విద్యార్థుల్లో రక్తహీనత సమస్యలు పెరుగుతున్నాయనీ, అందువల్ల వారిపై దృష్టి సారించాలని కోరారు. చిన్నారులు మన భవిష్యత్తు పెట్టుబడి... వారిని రక్తహీనతకు బలి చేయొద్దని కోరారు. బలహీనంగా ఉన్నవారు శారీరకంగా బలంగా తయారు కావడానికి చిరుధాన్యాల ప్రాధాన్యతపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలతో పాటు, రాజ్‌భవన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.