Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'యుటిఎస్' మొబైల్ యాప్ ద్వారా సాధారణ టికెట్లు కొనుగోలుకు సంబంధించిన దూర పరిధిని విస్తరించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 10 కిలోమీటర్ల లోపు పరిధిలో, ఇతర స్టేషన్ల నుంచి ప్రయాణించే వారు 20 కిలోమీటర్ల లోపు పరిధిలో టికెట్లను కొనుక్కోవచ్చు. అన్ రిజర్వుడ్ టికెట్లను ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా కొనే సదుపాయం కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే 'యుటిఎస్' మొబైల్ అప్లికేషన్ను 2018లో ప్రవేశపెట్టింది. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే వారు డిజిటల్ పద్ధతిలో టికెట్లు కొనే వెసులుబాటు కల్పించింది.