Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులతో హైకోర్టు జడ్జీల భేటి
- భూసేకరణ, ఇతర అంశాలపై కసరత్తు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల మాదరిగానే జిల్లా న్యాయస్థానాలను నిర్మించాలని హైకోర్టు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆమేరకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులు, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ, ఇతర అధికారులు జిల్లా న్యాయస్థానాల భవనాల నిర్మాణంపై దృష్టిసారించారు. ఇప్పటికే కసరత్తుకు శ్రీకారం చుట్టారు. బుధవారం హైకోర్టులో న్యాయమూర్తులు, ఆయా శాఖల అధికారులు భేటి అయ్యారు. 33 జిల్లాలకుగాను 23 జిల్లాల్లో కొత్త జిల్లా న్యాయ స్థానాల(డిస్ట్రీక్ట్ అండ్ సెషన్స్ కోర్టు) భవనాలను నిర్మించాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆమేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో భూమితోపాటు నిధులనూ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రక్రియ గత కొంతకాలంగా సాగుతున్నది. ఇప్పుడిప్పుడే కొలిక్కివస్తు న్నది. పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఈనేపథ్యంలో 23 జిల్లాల్లో ఇప్పటికే హైకోర్టు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈనేపథ్యంలో నిధుల, డిజైన్లపై కూడా కొంత చర్చ చోటుచేసుకున్నట్టు సమాచారం. అలాగే ఒక్కో జిల్లా న్యాయస్థానానికి స్థానిక లభ్యతను బట్టి ఐదు ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి అవసరమని అంచనా వేశారు.