Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్ ఏ80.86
- ఆల్‌టైం కనిష్టానికి పతనం
- దిగుమతులు మరింత భారం
- 82కు పడిపోవచ్చు..!
నవ తెలంగాణ - బిజినెస్ డెస్క్
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెల పోతోంది. చరిత్రలోనే ఇది వరకూ ఎప్పుడూ లేని స్థాయిలో పతనమయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో గురువారం రూపాయి విలువ ఓ దశలో దాదాపు 1.24 శాతం మేర నష్టపోయింది. తుదకు డాలరుతో పోలిస్తే 89 పైసలు క్షీణించి 80.86కు పతనమయ్యింది. ఇది రూపాయి చరిత్రలోనే అతిపెద్ద పతనం. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తర్వాత ఒకే రోజు ఇంత విలువ కోల్పోవడం కూడా ఇదే తొలిసారి. బుధవారం సెషన్లో 79.97 వద్ద ముగిసింది. రూపాయి విలువ పటిష్టానికి ఆర్బిఐ తీసుకున్న చర్యలు బలియంగా లేవని పలువురు ట్రేడర్లు రాయిటర్స్‌తో పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్టు ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పావెల్ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినప్పుడు దేశీయ మార్కెట్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. అధిక రాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగి బలపడుతుంది. ఈ క్రమంలోనే డాలర్ విలువ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది.