Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదినేని వెంకటేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పైలా చంద్రక్క జీవితం అందరికీ ఆదర్శనీయమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె రెండో వర్థంతిని హైదరాబాద్ విద్యానగర్లోని సీపీ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సాదినేని మాట్లాడుతూ నాటి శ్రీకాకుళ పోరాటంలో చంద్రక్క కీలక పాత్ర పోషించారని తెలిపారు. చివరివరకు విప్లవకారిణిగా బతికారని గుర్తుచేశారు. 11ఏండ్లు జైలు జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు. ఆమె మరణం ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్, ఐఎఫ్టీయు నాయకులు ఎం. శ్రీనివాస్, విశ్వనాథ్, జే. సీతారామయ్య, పీఓడబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సరళ, రేణుక తదితరులు పాల్గొన్నారు.