Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 26న హైటెక్స్‌లో ఇండియన్ ఐడల్ షణ్ముఖప్రియ ప్రత్యక్ష కచేరి నిర్వహిస్తున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ ప్రకటించింది. అదే రోజు పద్మశ్రీ కిన్నెర మొగులయ్యతో ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేననీ, ప్రవేశం ఉచితమని చెప్పారు. అలాగే సంప్రదాయక వంటకాలతో పాటు 75 రకాల బిర్యానీలతో ఉదయం 10 గంటల నుంచి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శుక్రవారంనాడాయన పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, ఇతర అధికారులతో బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోజు కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.