Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మైనింగ్‌కు సంబంధించి అత్యాధునిక శాస్త్ర పరిశోధనలు, పద్ధతులను పరిశ్రమలు అందిపుచ్చుకోవాలని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ అన్నారు. మైనింగ్ విద్యా సంస్థలు ఈ మేరకు పూర్వ విద్యార్థులతో సిలబస్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో అల్యూమినీ ఆఫ్ మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ (ఓయూ అండ్ కేయూ), అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా వర్సిటీ మైనింగ్ ఇంజినీరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో 'ఖనిజ పరిశ్రమలో ఇటీవలి ధోరణులు' అంశంపై రెండ్రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనింగ్ సంస్థలు, పరిశ్రమల మధ్య పరస్పర సమన్వయం ఎంతో అవసరమన్నారు. ఆధునిక మైనింగ్ పద్ధతులు తక్కువ వ్యయంతో పర్యావరణ హితంగా, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించాలనీ, దీనికి సీనియర్ మైనింగ్ మేధావులతో ఉన్న అల్యూమినీ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలని సూచించారు. మైనింగ్ విద్యా సంస్థలు తమ బోధనాంశంలో భాగంగా విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరీక్షలను తప్పనిసరి చేయాలన్నారు. దేశ అవసరాల రీత్యా క్రమంగా మైనింగ్‌ను పెద్ద ఎత్తున చేపడుతున్న నేపథ్యంలో రక్షణ, పర్యావరణ హిత బ్లాస్టింగ్, కాలుష్య నివారణ తదితర అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్నారు. కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ అధ్యక్షత వహించారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మలరు టికేదార్, ఉస్మానియా రిజిస్ట్రార్ పీ లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కమిటీ నుంచి చైర్మెన్ బిక్కి రమేశ్ కుమార్, డాక్టర్ డి.విజరు కుమార్ ప్రసగించారు. తొలి రోజు సమావేశానికి కన్వీనర్ కె.జె.అమర్నాథ్ స్వాగతం పలికారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య వందన సమర్పణ చేశారు.