Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు కార్మికులకు,పోలీసులకు వాగ్వాదం
- పరిస్థితి ఉద్రిక్తం..నాయకులు,కార్మికుల ఈడ్చివేత..అరెస్ట్‌లు
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం కోసం.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం ప్రధాన కార్యాలయాలను ముట్టడించారు. అయితే, వీరి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించారు. గేటు ముందు నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరించడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నాయకులను, కార్మికులను ఈడ్చుకెళ్లారు.
కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆఫీస్‌ను దిగ్బంధనం చేశారు. కార్మికులను ఎలాగైనా చెల్లాచెదురు చేయాలని పోలీసులు, సెక్యూరిటీ గార్డులు కుటిల యత్నం చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను, నాయకులను గేటు ముందు నుంచి వెళ్లిపోవాలని, పక్కనే కేటాయించిన స్థలంలో సమ్మె చేసుకోవాలని వారించారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో నాయకులను, కార్మికులను బలవంతంగా ఈడ్చి పడేవారు. మహిళలను సైతం లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీసుస్టేషన్‌ను తరలించారు. దాంతో ప్రధాన కార్యాలయం ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాయకుల అరెస్టులను ఖండిస్తూ కార్మికులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సమ్మెను కొనసాగించారు. కొత్తగూడెం ఒకటో పోలీస్ స్టేషన్, రెండో పోలీస్ టౌన్ స్టేషన్లలో నిర్బంధించిన కార్మికులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎంవి.అప్పారావు పరామర్శించారు. అరెస్టులను ఖండించారు. కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా (గోలేటి) జీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు కార్మిక నాయకులను అడ్డగించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.