Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 రంగులు, 240 డిజైన్లు...
- 800 కలర్ కాంబినేషన్లు...
- రూ. 340 కోట్ల వ్యయంతో కోటి బతుకమ్మ చీరెలు పంపిణీ....
- రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ చేనేత సహకార సంస్ధ ( టెస్కో) ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 240 పైచిలుకు వెరైటీ డిజైనర్లతో చీరెలు తయారు చేశారు. ఒక కోటి 18 లక్షల చీరెలను మహిళలకు పంపిణీ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ పంపిణీలో పాల్గొంటున్నారు. ఇటీవల రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభించారు. తెలంగాణ సంస్కతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
బతుకమ్మ చీరెల తయారీ కోసం ఈ ఏడాది రూ. 340 కోట్ల వ్యయం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందారు. రంగు రంగుల వన్నెల్ల, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో వాటినినేయించారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరెలను మరింత ఆకర్శణీయంగా వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. రాష్ట్ర అవతరణ అనంతరం ప్రతి బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైన్లలో చీరెలు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.