Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హార్ట్ అండ్ లంగ్ మిషన్ సహాయంతో ఇంట్రా కార్డియాక్ రిపేర్ సర్జరీని ఎనిమిది గంటల్లో విజయవంతంగా నిర్వహించి గుండె రంధ్రాన్ని పూడ్చి ఊపిరితిత్తులకు రక్తసరఫరాను మెరుగుపరిచినట్టు హైదరాబాద్ కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్స్ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌కు చెందిన 14 ఏండ్ల బాలికకు కుడి వైపు ఉండాల్సిన అవయవాలు ఎడమ వైపున, ఎడమ వైపు ఉండాల్సిన అవయవాలు కుడి వైపున ఉన్నాయి.
దీంతో పాటు గుండెలో రంధ్రం ఏర్పడి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందక వాటి స్థాయి 78 నుంచి 80 శాతానికి పడిపోయేది.
ఈ క్రమంలో ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ వివేక్ బాబు ఆధ్వర్యంలో వైద్యులు ఆమెకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ బోయినపల్లి మాట్లాడుతూ క్లిష్టమైన సర్జరీలు చేయడంలో ప్రతిమ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.