Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేదీ అయిపోయిందని తిరిగి పంపిన బ్యాంకు అధికారులు
- తిరిగి అధికారులకు చెక్కులు ఇచ్చేసిన లబ్దిదారులు
నవతెలంగాణ- బాలానగర్.
ప్రభుత్వం ప్రయో గాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ది దారులకు తేదీ ముగిసిన చెక్కులు ఇచ్చారు. అవి పట్టుకుని బ్యాంకులకు వెళ్లిన బాధితులను.. ఇవి చెల్లవంటూ పంపించారు. ''చెల్లని చెక్కులను మేమేం చేసుకోవాలి.. మాకెందుకు'' అంటూ లబ్దిదారులు అధికారులకు ఇచ్చేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అయితే, ఒకరోజు సమయం ఉందనంగా చెక్కులు పంపిణీ చేశారని లబ్దిదారులు తెలిపారు. వాటిని తీసుకుని లబ్దిదారులు బ్యాంకులకు వెళ్తే.. డేట్ అయి పోయిందని బ్యాంకు సిబ్బంది తిరిగి పంపారు. దాంతో లబ్దిదారులు తహ సీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు ఆ చెక్కులు ఇస్తే.. మళ్లీ తెప్పిస్తామని తహసీల్దార్ చెప్పడంతో.. ఇచ్చేశారు. కొత్త చెక్కులు రావడానికి కొంత సమయం పడుతుందని లబ్దిదారులకు చెప్పారు.