Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ సంక్షేమ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన్నే ఉందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. శనివారం సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో బీసీ సంక్షేమ శాఖ గురుకులాల ప్రిన్సిపాళ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, బీసీ హాస్టళ్ల వార్డెన్లు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశ మయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు ఎంప్లాయీ ప్రెండ్లీ ప్రభుత్వమనీ, సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. గతంలో సరైన విద్యాలయాలు అందుబాటులో లేక విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు విద్యార్థులు చదువుతో పాటు కులవృత్తుల్లోనూ రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రేమానురాగాలతో చదువు, ఆరోగ్యాన్ని అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీసీగురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు, బాలాచారి, అలోక్ కుమార్, చంద్రశేఖర్, సంద్య, ఉదరు, తదితరులు పాల్గొన్నారు.