Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలను శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి విడుదల చేశారు. పీఈసెట్‌కు 3,657 మంది దరఖాస్తు చేయగా, 2,360 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,297 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,264 (95.93 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,223 మంది అబ్బాయిలు దరఖాస్తు చేస్తే 1,473 మంది పరీక్ష రాయగా, 1,441 (97.83 శాతం) మంది ఉత్తీర్ణుల య్యారు. 1,434 మంది అమ్మాయిలు దరఖాస్తు చేయగా, 887 మంది పరీక్షకు హాజరైతే 823 (92.78 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో బీపీఈడీకి 2,121 మంది దరఖాస్తు చేస్తే, 1,456 మంది పరీక్ష రాయగా, 1,393 (95.67 శాతం) మంది పాసయ్యారు. డీపీఈడీకి 1,536 మంది దరఖాస్తు చేయగా, 904 పరీక్ష రాస్తే, 871 (96.35 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బీపీఈడీలో మహబూబ్ నగర్‌కు చెందిన జి కృష్ణమ్మ ప్రథమ ర్యాంకు సాధించారు. డీపీఈడీలో రంగారెడ్డి జిల్లాకు చెందిన బధావత్ శివ టాపర్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ కృష్ణారావు, పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.