Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మ జోతిబాఫూలే ప్రారంభించిన సత్యశోధక సమాజ్ ఏర్పడి 150 ఏండ్లు అయిన సందర్భంగా వార్షికోత్సవ సభను శనివారం హైదరాబాద్‌లో ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్ ఐఓఎఫ్ఎస్ మాజీ అధికారి, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ వై సత్యనారాయణ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. సత్యశోధక సమాజం ఏర్పడి 150 ఏండ్లు గడిచాయనీ, ఆ చరిత్ర మామూలు వ్యక్తులను మహనీయులను చేసిందని గుర్తు చేశారు. ఉత్పత్తికి సంబంధించిన శ్రమజీవుల చరిత్ర అనీ, దాన్ని ప్రస్తుతం మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తు న్నారని విమర్శించారు. అది సరైంది కాదన్నారు. మహాత్మ జోతిబాపూలే లాంటి వ్యక్తులు సమాజంలో అనేక పెడధోరణులపై పోరాటాలు నిర్వహిం చారని చెప్పారు. అందుకు సత్యశోధక సమాజం ఎంతో తోడ్పాటునందిం చిందని వివరించారు. కార్యక్రమంలో అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్‌రెడ్డి, కోఆర్డినేటర్ డి జనార్దన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్ కుమార్, కార్యాలయ సిబ్బంది కోట మురళీకృష్ణ, కౌటం రాజేష్, తాళ్లూరి రాజా పాల్గొన్నారు.