Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోక్సో కేసు నమోదు
నవతెలంగాణ-దమ్మపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్గం గొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు విద్యార్థిని(13)పై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని, మార్కులు తక్కువ వేస్తానని బాలికను బెదిరించాడు. బాలిక ఆరోగ్యం బాగోలేదని కొద్ది రోజుల కిందట తల్లి వద్దకు వెళ్లింది. అయితే, తల్లికి అనుమానం రావడంతో బాలికను నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దాంతో తల్లి శుక్రవారం రాత్రి దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు పిచ్చయ్యపై ఏఎస్ఐ ప్రతాపరెడ్డి ఫోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కేసు పెట్టొద్దని ఆ పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయులు, అధికార పార్టీకి చెందిన వారు ఒత్తిడి బాలిక తల్లిపై ఒత్తిడి చేసి.. మభ్యపెట్టారని సమాచారం. అయినా ఆమె ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.