Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ మహిళకు గాయాలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
పోడు భూమిలో సాగు చేస్తున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాతరెడ్డి గూడెం పంచాయతీ బండారు గుంపు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దమ్మపేట మండలం అంకంపాలెంకు చెందిన గిరిజనులు అశ్వారావుపేట మండలం బండారుగుంపు సమీపంలో పోడు భూమిని ఎప్పటి నుండో సాగు చేసుకుంటున్నారు. సాగు చేస్తున్న రైతుల వద్దకు అటవీ శాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. ఆదివాసీ మహిళపై చేయి చేసుకున్నారని, ఆమె స్పృహ కోల్పోయిందని రైతులు రోదిస్తూ చెప్పారు. రేంజ్ అధికారులు, బీట్ అధికారులు, అశ్వారావుపేట ఎస్ఐ అరుణ సమక్షంలోనే నాగళ్ల నుంచి ఎడ్లను వదిలారని, నాగల్లను ఎత్తుకెళ్లి జీపులో తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంత రక్షణలో భాగంగా తమ సిబ్బంది అక్కడకు వెళ్తే గిరిజనులే దాడి చేశారని దమ్మపేట డీఆర్ఓ వెంకటలకిë ఆరోపించారు.