Authorization
Sat May 17, 2025 04:49:54 am
- మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఒక్క కలం పోటుతో సింగిరేణి కార్మికుల జీవితాలు మారి పోతాయంటూ ప్రభుత్వాధినేతలు గతంలో చెప్పారనీ, అలాంటప్పుడు ఇప్పటివరకు జీతాలు ఎందుకు పెంచలేదని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పన్నెండు వేల రూపాయలతో కార్మికుల కుటుంబాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.