Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్‌ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధిబృందం బస్‌భవన్‌లో సజ్జనార్‌కు వినతిపత్రం సమర్పించింది. అనేక ఏండ్లుగా దసరాకు పండుగకు ముందు కార్మికులకు అడ్వాన్స్ ఇచ్చి పది నెలల్లో రికవరీ చేసుకొనేవారనీ, కానీ ఇప్పటి వరకు యాజమాన్యం ఆ ఆలోచన కూడా చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. 2019 నుంచి ఆర్థిక ఇబ్బందులు, కోవిడ్ పేరుతో కార్మికులకు దసరా అడ్వాన్స్ ఇవ్వట్లేదని తెలిపారు. ప్రస్తుతం సంస్థ లాభాల బాటలో పయనిస్తున్నందున, నిలిపివేసిన పండగ అడ్వాన్స్‌ను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.