Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో పూలను పూజించే, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నదనీ, రాష్ట్ర పండుగగా గుర్తిస్తున్నదని తెలిపారు.